శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 13:47:21

రైతును కాపాడడం మా కర్తవ్యం : ఎంపీ కేకే

రైతును కాపాడడం మా కర్తవ్యం : ఎంపీ కేకే

న్యూఢిల్లీ : రైతును కాపాడడం తమ కర్తవ్యమని రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన చేపట్టాయి. గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు మార్చ్‌ నిర్వహించిన నిర్వహించాయి. విపక్ష సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు మాట్లాడుతూ మొదటిసారిగా ప్రతిపక్షాలు అన్ని ర్యాలీ తీసినట్లు చెప్పారు.

గాంధీ స్ఫూర్తితో ర్యాలీ తీశామని, మహాత్ముడు సైతం భూమి కర్షకుడిదే అన్నాడని గుర్తు చేశారు. అలాంటి భూమిని కార్పోరేట్‌ సెక్టార్‌కి అప్పగించి రైతును అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును కాపాడడం మా కర్తవ్యమని స్పష్టం చేశారు. వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో తప్పుడు పద్ధతిలో పాస్‌ చేశారని ఆరోపించారు. సభ్యులను రూల్స్‌కు విరుద్ధంగా సస్పెండ్‌ చేశారన్నారు. బిల్లును వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు జీ సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, సురేష్‌రెడ్డితో పాటు విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo