గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 16:41:21

ప్రభుత్వమే పండుగలను నిర్వహించడం గొప్ప విషయం

ప్రభుత్వమే పండుగలను నిర్వహించడం గొప్ప విషయం

మ‌హ‌బూబాబాద్ : ప్రభుత్వమే ప్రజలకు బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని తొర్రూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు, పెద్దవంగ‌ర‌ మండ‌లాల మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీరె‌ల‌ను పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ప్రభుత్వమే పండుగ‌ల‌ని నిర్వహిస్తున్నది పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభ్వుతం పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతం‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo