అన్నార్తులకు బాసటగా..

- అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఐటీ ఉద్యోగులు
- న్యూ ఇయర్ వేడుకలు రద్దు.. అనాథలకు సేవ
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ‘సాయం’.. రెండు అక్షరాల పదమే అయినా.. కష్టాల్లో ఉన్నవారికి అది కొండంత అండ. బాసటగా నిలిచినవారు సాయంపొందినవారికి దేవుళ్లుగా కనిపిస్తారు. ఉన్నదాంట్లో కొంత అందించి అండగా నిలిచే హృదయం ఉండాలి. అలాంటి కోవకే చెందిన కొంతమంది ఐటీ ఉద్యోగులు కొత్త ఏడాది సంబురాలకు దూరంగా ఉండి ఆ సొమ్ముతో అభాగ్యులకు సాయం అందించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. డిసెంబర్ 31, జనవరి 1న పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వేడుకలు చేసుకోం..
స్నేహితులతో కలిసి ఏటా ఘనంగా న్యూ ఇయర్ పార్టీలు చేసుకొనేవాళ్లం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సుమారు 10 వేలు ఖర్చు చేసేవాళ్లం. ఈ డబ్బుతో అన్నదానం, రాత్రి పూట దుప్పట్లు, అనాథాశ్రమంలో సంబురాలు నిర్వహిస్తాం.
- సుదీష్ణ ముత్యపు, ఐటీ ఉద్యోగి
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం
ఈ సారి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించడం లేదు. స్నేహితులతో కలిసి అనాథాశ్రమాలకు వెళ్లి పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. ప్రతి వారాంతంలో సేవ చేయడానికి కొంత సమయం కేటాయించడం ఆనందంగా ఉన్నది.
- భార్గవి రెడ్డి, ఐటీ ఉద్యోగి
అన్నదానానికి ఏర్పాట్లు
లాక్డౌన్లో కొంతమంది కాలి నడకన తమ గ్రామాలకు వెళ్లారు. అలాంటి ఘటనలు కలిచివేశాయి. మనం సంబురాలు చేసుకోవడం సబబు కాదు. అందుకే ఈ సారి అన్నదానం చేస్తున్నాం.
- తేజస్విని, ఐటీ ఉద్యోగి
సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటాం
జిందగీ ఇమేజెస్ వేదిక ద్వారా చాలా మంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు. మద్య నిషేధానికి డిమాండ్ చేసే మేము చాలా వరకు తాగుడు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాం.
- చేగొండి చంద్రశేఖర్, జిందగీ ఇమేజెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు
తాజావార్తలు
- ముగిసిన బ్రహ్మోత్సవాలు
- ‘హాల్మార్క్' నిర్వాహకుల ఇష్టారాజ్యం
- టీఆర్ఎస్ నాయకుడి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా
- టీకా వచ్చేసింది.. ఆందోళన వద్దు
- మహమ్మారి అంతానికి నాంది
- తెలంగాణ భవన్ త్వరగా పూర్తి చేయాలి
- ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కృషి
- మెరిసిన గిరిజన విద్యార్థి
- కరోనా వ్యాక్సిన్ తయారీ గర్వకారణం
- వ్యాక్సిన్ సురక్షితం.. భయపడొద్దు