శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 06:55:08

నిమ్స్‌లో సిద్ధమవుతున్న ఐసోలేషన్‌ వార్డు

నిమ్స్‌లో సిద్ధమవుతున్న ఐసోలేషన్‌ వార్డు

హైదరాబాద్ ‌:  కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గాంధీ తదితర దవాఖానల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా నిమ్స్‌ దవాఖానలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఎమర్జెన్సీ వార్డు పక్క భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. మొదటిదశలో పది పడకలతో ఏర్పాటు చేస్తుండగా, మొదటి ఫ్లోర్‌లో స్క్రీనింగ్‌, రెండో ఫ్లోర్‌లో ఐసీయూ, అక్కడే మరో గదిలో అబ్జర్వేషన్‌ కోసం కేటాయించారు. మొత్తం 40 పడకాలను ఏర్పాటు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఇక్కడికి తరలించి రక్త నమూనాలను సేకరించడంతోపాటు  వారికి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.


logo