గురువారం 09 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 12:32:40

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరికలు

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరికలు

మహబూబ్ నగర్ : టీఆర్ఎస్  ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ పట్టణంలో బీజేపీ నుంచి 22 వార్డు కౌన్సిలర్ గా ఎంపికైన రష్మిత.. ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధి, టీఆర్ఎస్ విధివిధానాలకు ఆకర్షితులై బీజేపీకి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో  టీఆర్ఎస్ లో చేరినట్లు వారు వెల్లడించారు. కౌన్సిలర్ రష్మితతో పాటు బీజేపీ నాయకులు భాస్కర్, రమేష్, ప్రదీప్, అనుదీప్ పార్టీలో చేరారు.


logo