సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 16:47:42

ఉచిత ఆన్‌లైన్ పీజీ మెడిక‌ల్ ఎంట్ర‌న్స్ కోచింగ్‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

ఉచిత ఆన్‌లైన్ పీజీ మెడిక‌ల్ ఎంట్ర‌న్స్ కోచింగ్‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్ : షెడ్యూల్ క్యాస్ట్‌(ఎస్‌సీ) అభ్య‌ర్థుల నుండి ఉచిత ఆన్‌లైన్ పీజీ మెడిక‌ల్ ఎంట్ర‌న్స్ కోచింగ్‌కు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూష‌న్స్ సొసైటీ (టీఎస్‌డబ్ల్యుఆర్ఇఎస్) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. ఎంబీబీఎస్ 3వ, 4వ సంవత్సరంలో ఉన్న‌ మెడికోలు, హౌస్ సర్జన్లు, ఎంబీబీఎస్ పాస్ అవుట్స్ ఈ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌కు అర్హులు అని టీఎస్‌డబ్ల్యుఆర్ఇఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 8గా పేర్కొంది. మరిన్ని వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు www.tswreis.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా సూచించారు. 


logo