ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 00:46:32

అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బీజేపీకి చెందిన మహబూబ్‌నగర్‌ 22వ వార్డు కౌన్సిలర్‌ రష్మితప్రశాంత్‌తోపాటు పలువురు నాయకులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో మంగళవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కృషి చేస్తున్నదన్నారు. 


logo