శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:52:43

పీవీపై కావ్యరచనకు ఆహ్వానం

పీవీపై కావ్యరచనకు ఆహ్వానం

  • డిసెంబర్‌ 31లోగా పంపాలన్న ‘సాహితీ సిరికోన’

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని కవితా పురస్కారం కోసం ప్రత్యేక పద్య కావ్యం, దీర్ఘవచన కవితాకావ్యం రచనలను సాహితీ సిరికోన వాక్సలి బృంద వేదిక, సాహిత్య దినపత్రిక ఆహ్వానిస్తున్నది. ‘నేర్చుకోవడానికి వయసు వగైరా అడ్డుకాదు.. అహం అడ్డురాకూడదు’ అంటూ దాన్ని ఆచరించి చూపిన పీవీ నరసింహారావు జీవితం, ఆయన సేవలు, సామాజిక-తాత్విక దృష్టి, జీవన సాధనలు, సాధించిన విజయాలు, విశేషాలు, చేసిన సంస్కరణలను ఇతివృత్తంగా తీసుకొని స్ఫూర్తిదాయకంగా కావ్యాన్ని రచించాలని సూచించింది. రచన ముద్రణలో కనీసం 60 పేజీలకు తగ్గకుండా ఉండాలని పేర్కొన్నది. కావ్యం సిరికోనకే ప్రత్యేకంగా సమర్పించాలని, సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల్లో ఇదివరకే ప్రచురితమైన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని నిర్వాహకులు స్పష్టంచేశారు. తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఔత్సాహికులైన తెలుగు కవులు కూడా ఈ రచనలను డిసెంబర్‌ 31వ తేదీలోగా పంపాలని కోరారు. వివరాలకు గంగిశెట్టి లక్ష్మీనారాయణను 94418 09566లో, జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తిని 99488 96984 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.logo