ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 15:48:39

కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి ఆహ్వానం

సిద్దిపేట/చేర్యాల : జ‌న‌వ‌రి 10న జ‌రిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఆహ్వానం అందింది. మంగ‌ళ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో ఆల‌య అధికారులు, అర్చకులు తదితరులు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో ఆయ‌ల ఈవో బాలాజీ, ఏఈవో గంగ‌ శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మ‌ల్లికార్జున్, స్థానాచార్యులు మ‌ల్లయ్య ఉన్నారు.