శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 17:08:52

‘నమస్తే తెలంగాణ’ కథల పోటీకి ఆహ్వానం..

‘నమస్తే తెలంగాణ’ కథల పోటీకి ఆహ్వానం..

హైదరాబాద్‌: మీకు కథలు రాయడమంటే ఇష్టమా..? సంస్కృతి, చరిత్ర సమకాలీన జీవన వైవిధ్యాలు, వైరుధ్యాల నేపథ్యాలను అందంగా అక్షరీకరించగలరా..? నవ్యత, సృజనాత్మకతతో కథలను చదివించేలా రాయగలరా..? ఇంకెందుకాలస్యం ‘నమస్తే తెలంగాణ’ కథల పోటీ కోసం మీ కలాన్ని కదిలించండి. మీరు రాసిన కథలను మాకు పంపండి.. ఉత్తమ కథలకు బహుమతులు పొందండి.

గతేడాదిలాగే నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం (ముల్కనూరు, భీమదేవరపల్లి మండలం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా)తో సంయుక్తంగా ఈ కథల పోటీని నిర్వహిస్తోంది. పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన 22 కథలను ఎంపిక చేస్తాం. ప్రథమ బహుమతి (ఒక్కరికి) రూ.  50,000, ద్వితీయ బహుమతులు ఇద్దరికి (ఒక్కొక్కరికి)  రూ.  25,000, తృతీయ బహుమతులు ముగ్గురికి (ఒక్కొక్కరికి) రూ.  10,000, కన్సొలేషన్‌ బహుమతులు ఆరుగురికి (ఒక్కొక్కరికి) రూ. 5,000 అందజేస్తాం. బహుమతి పొందిన కథలు నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో ప్రచురితం అవుతాయి. పది కథలను సాధారణ ప్రచురణ కోసం స్వీకరిస్తాం. ఈ కథలకు వెయ్యి రూపాయలతోపాటు,జ్ఞాపికలు అందజేస్తాం. బహుమతి పొందిన కథలు పుస్తక రూపంలో కూడా అచ్చు వేసే అధికారం పోటీ నిర్వాహకులకు ఉంటుంది. 

పంపాల్సిన విధానం 

  • రాత ప్రతి అయితే  కథ 12 పేజీలు మించకుండా ఉండాలి. 
  • ఈ-మెయిల్‌ ద్వారా పంపేవారు యూనికోడ్‌లో వర్డ్‌ఫైల్‌ పంపవచ్చు. దాన్ని పీడీఎఫ్‌లోకి కూడా మార్చి ఎటాచ్‌ చేయాలి. 
  • పేజ్‌మేకర్‌లో డీటీపీ చేయించి కథను పంపేవారు పీఎమ్‌డీ ఫైల్‌ను, పీడీఎఫ్‌ను కూడా జత చేసి ఆ రెండింటినీ ఈ-మెయిల్‌లో ఎటాచ్‌ చేసి పంపాలి. 
  • డీటీపీ, వర్డ్‌ఫైల్‌ ఏ4 సైజులో 14 నుంచి 16 ఫాంట్‌లో నాలుగు, ఐదు పేజీలకు మించకూడదు. 
  • పదాల్లో అయితే కథ 1500 పదాలకు మించకూడదు. 
  • హామీపత్రం జత చేయడం మర్చిపోవద్దు.
  • కథల ప్రతులపైన రచయిత / రచయిత్రి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రం పైన మాత్రమే పేరు ఉండాలి. 

కథలు పంపాల్సిన చిరునామా..

బతుకమ్మ కథలపోటీ, నమస్తే తెలంగాణ
# 8-2-603/1/7, 8, 9, రోడ్‌ నంబర్‌ 10, 
బంజారాహిల్స్‌, హైదరాబాద్‌  500 034.
మీ కథలు పంపాల్సిన ఈ -మెయిల్‌ ఐడీ : [email protected]
కథలు మాకు అందాల్సిన చివరి తేదీ : ఆగస్టు 31, 2020

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo