సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 12:48:55

అఖండ జ్యోతి కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం

అఖండ జ్యోతి కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం

హైదరాబాద్‌ : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమానికి  పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును  ఆలయ ఈవో వీరస్వామి, అర్చకులు, తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీ ఆర్ శర్మ, ఇతర అర్చకులతో కలిసిఆహ్వానించారు.

 హైదరాబాద్ మంత్రుల ఆవాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిసి, అఖండ జ్యోతి ఆహ్వాన పత్రికను మంత్రి కి అందజేశారు. దక్షిణ భారతదేశంలోనే అఖండ జ్యోతి నిర్వహిస్తున్న మూడో దేవస్థానం పాలకుర్తి అని వారు తెలిపారు. 29న నిర్వహించే అఖండజ్యోతి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి రామన్న, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.