బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 02:18:16

మాస్కులు ఇచ్చి పెండ్లికి ఆహ్వానం

మాస్కులు ఇచ్చి పెండ్లికి ఆహ్వానం

మెట్‌పల్లిటౌన్‌: కరోనా వైరస్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన బెజ్జారపు ప్రవీణ్‌ వివాహం లక్ష్మీతో ఈ నెల 20న మెట్‌పల్లిలో జరగనుంది. కాగా ప్రవీణ్‌ తన పెండ్లికి మాస్క్‌తో రండి అంటూ పెండ్లి పత్రికతో పాటు మాస్క్‌ను ఇస్తూ ఆహ్వానిస్తున్నాడు.  


logo