హైదరాబాద్ : భారతీయ తపాలా శాఖ వారు కమిషన్ బేసిస్‌పై తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు కావాల్సిన ఏజెంట్ల నియమకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ తెలియజేశారు. 10 వ తరగతి పాస్ అయ్యి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత హైదరాబాద్ నగరానికి చెందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆసక్తి కలిగినవారు పూర్తి చేసిన దరఖాస్తులను తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్, దివాన్ దేవడి, హైదరాబాద్-02 ఆఫీసులో జులై 30వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులు ఆగస్టు 12, 13 తేదీలలో ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఏజెంట్‌గా నియమితులైనవారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ ఆఫీస్‌ను సంప్రదించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్‌పై కేసు నమోదు
తహసీల్దార్‌పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి
హరితహారంతో ములుగుకు పూర్వవైభవం రావాలి