ఆదివారం 31 మే 2020
Telangana - May 18, 2020 , 21:31:16

వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్ అర్బన్ : జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారుల ఖాళీ పోస్టులను భర్తీ చేయుటకు  ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలో  25 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ పోస్టులను రూల్ ఆఫ్ రిజర్వేషన్  పద్ధతిపై భర్తీ చేస్తామని, ఆ పోస్టులకు  బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లోమా అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ డిప్లోమా అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీ టెక్ ఇంజినీరింగ్ అర్హత గల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అర్హులు దరఖాస్తు  చేసుకోవచ్చన్నారు.  సంబంధిత దరఖాస్తులు ఈ నెల  19 వ తేదీ నుంచి  జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం అందు బాటులో ఉంటాయన్నారు. నింపిన దరఖాస్తు  ఈ నెల 21 వా తేదీ సాయత్రం 4 గంటల  లోపు జిల్లా కోర్టు వెనుక గల వెంకటేశ్వర టెంపుల్ వద్ద గల కార్యాలయంలో అందేజేయాలన్నారు.

 మెరిట్ జాబితాను ఈ నెల 22 వ తేదీ ఉదయం11 గంటలకు నోటీస్ బోర్డు ప్రదర్శించి  అదే రోజు సాయంత్రం 4  గంటల లోపు అభ్యంతరాలు స్వీకరిస్తారు.  ఈ నెల 23 వ తేదీన ఉదయం 11 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఆ తర్వాత అదే  రోజు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని కలెక్టర్ వివరించారు. బీఎస్సీ అగ్రికల్చర్ 10 పోస్టులు,  అగ్రికల్చరల్ డిప్లోమా,  అగ్రికల్చరల్ సీడ్ టెక్నాలజీ 13 పోస్టులు బీటెక్, డిప్లోమా ఇన్  అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ లో 2 పోస్టుల కోసం భర్తీ కోసం ఆసక్తి అర్హత గల అభ్యర్థులు   దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్  తెలిపారు.


logo