నల్లగొండ : ప్రాంతీయ వైద్య శాలల్లో స్టాఫ్ నర్సుల నియామకానికి తెలంగాణ వైద్య విధాన పరిషత్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నకిరేకల్ ప్రాంతీయ వైద్య శాలల్లో కొవిడ్ వైద్య సేవల కోసం 3 నెలల పాటు పని చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అవుట్ సోర్సింగ్ పద్ధతిలో స్టాప్ నర్స్ లు (10) నియామకానికి అర్హత, అనుభవం గల అభ్యర్థులు ఏప్రిల్ 29 లోగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన నల్లగొండ ఆవరణలో గల జిల్లా వైద్య శాలల పర్యవేక్షణ అధికారి కార్యాలయం(సదరం ఆఫీస్ పై అంతస్తు) లో దరఖాస్తు చేసుకోవాలని డి.సి.హెచ్ ఎస్. డా. మాతృ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 30న దరఖాస్తులు పరిశీలించి మెరిట్ అభ్యర్థుల జాబితా మే 1న నోటీస్ బోర్డ్‌లో ప్రదర్శించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా