శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 16, 2020 , 08:39:25

ఇంగ్లీష్‌ మీడియం జీవో రద్దుపై సుప్రీంకు: ఏపీ

ఇంగ్లీష్‌ మీడియం జీవో రద్దుపై సుప్రీంకు: ఏపీ

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పని సరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ చూశాక సుప్రీంకోర్టుకు వెళతామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తప్పని సరిగా ఇంగ్లీష్‌మీడియం అమలు చేయాలని, ఒక్కో తరగతి పెంచుకుంటూ ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ఇంగ్లీష్‌మీడియం పాఠశాలలుగా చేయాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పేర్కొన్నారు.

 ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ జనరేషన్‌కు ఇంగ్లీష్‌ అనేది తప్పని సరి. సర్కారు బడికి వచ్చేది బడుగు బలహీన వర్గాల పిల్లలు. వారు ఉన్నతస్థానాలకు ఎదగాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లోని 90శాతం పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియం అమలు అవుతుందని, విద్యా విషయం అనేది స్థానిక సంస్థల ఇష్ట ప్రకారం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, విద్యా కమిటీలు ఇప్పటికే ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని తీర్మాణం చేశాయని గుర్తు చేశారు. logo