బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 21:02:53

నశా ముక్త్ భారత్‌తో మత్తు చిత్తు : కలెక్టర్ వెంకట్ రావు

నశా ముక్త్ భారత్‌తో మత్తు చిత్తు : కలెక్టర్ వెంకట్ రావు

మహబూబ్‌న‌గ‌ర్ : ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు. శనివారం సమాచారశాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి సంయుక్త ఆధ్వర్యంలో మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి చౌరస్తాలో నశా ముక్త్ భారత్ పై ఏర్పాటుచేసిన కళాకారుల కళాజాత ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సారా, క‌ల్తీ కల్లు, బీడీ, సిగరెట్, గుట్కా, హెరాయిన్ల వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా కళాజాత కళాకారుల ద్వారా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు.


అదనపు కలెక్టర్ సీతారామరావు, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి శంకరాచారి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ తిరుపతి రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మత్తు పదార్థాలపై పలు నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.logo