నిల్వ చేయడమే కీలకం

- కరోనా వ్యాక్సిన్ నిల్వకు భారీగా కోల్డ్ స్టోరేజీలు
- హైదరాబాద్లో 4 కోట్ల డోసులు నిల్వచేసేలా నిర్మాణం
- మూడు నెలల్లో అందుబాటులోకి ప్లాంట్లు
- గుబ్బా కోల్డ్ స్టోరేజ్ సీఈవో గుబ్బా కిరణ్ వెల్లడి
కంటోన్మెంట్: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ప్రజలకు టీకాలు వేయటం ఇటీవలే ప్రారంభించారు. మనదేశంలో కూడా అతి త్వరలో టీకాలు వేయటం మొదలవుతుంది. అయితే, ఈ టీకాలను అతి శీతల వాతావరణంలో నిల్వ చేయాల్సి రావటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు తాము పరిష్కారం చూపుతున్నామని చెప్పారు ‘గుబ్బా కోల్డ్ స్టోరేజ్' సీఈవో గుబ్బా కిరణ్. ప్రస్తుతం పూర్తిగా సిద్ధమైనవాటిలో ఫైజర్ కంపెనీ టీకా మినహా అన్నింటినీ 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ఫైజర్ టీకాకు మాత్రం -70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. వ్యాక్సిన్ తయారీ ఎంత ముఖ్యమో దానిని స్టోర్ చేయడం కూడా అంతే ముఖ్యమని.. ఆ దిశగా గుబ్బా కోల్డ్ స్టోరేజ్ విశేష కృషి చేస్తున్నదని కిరణ్ చెప్పారు. శనివారం సికింద్రాబాద్ తిరుమలగిరిలోని గుబ్బా కోల్డ్ స్టోరేజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యాక్సిన్ తయారీ నుంచి బాధితుడికి టీకా వేసే వరకు కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు ఎంతో ముఖ్యమన్నారు. గత ఆరు నెలలుగా వ్యాక్సిన్ నిల్వ విధానంపై తాము అవిశ్రాంతంగా పరిశోధన చేస్తున్నామని చెప్పారు.
భారీగా కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు
కరోనా టీకా నిల్వ కోసం 21 సీఎఫ్ఆర్ ఆన్లైన్ ఉష్ణోగ్రత పర్యవేక్షణ వ్యవస్థతో.. డబ్ల్యూహెచ్వో ఆమోదించిన సదుపాయాలు కావాలని గుబ్బా కిరణ్ తెలిపారు. మనదేశంలో 10 వేల వరకు కోల్డ్ స్టోరేజీలు ఉంటే ఫార్మా రంగానికి కేవలం 0.5% కన్నా తక్కువే కేటాయించారని చెప్పారు. మూడేండ్ల క్రితం క్రితం హైదరాబాద్లో ఫార్మా కైంప్లెంట్ కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తాము.. 8,800 ప్యాలెట్లతో అపెద్ద కోల్డ్ స్టోరేజీలను నిర్మించామని తెలిపారు. 50కి పైగా ఫార్మా క్లయింట్లకు గుబ్బా కోల్డ్ స్టోరేజ్ సేవలను అందిస్తున్నదని చెప్పారు. మార్చి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వకోసం 10 వేల ప్యాలెట్ల సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- చదువుకోక టీవీ చూస్తున్నాడని నిప్పంటించాడు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1
- మామిడి విక్రయాలు ఇక్కడే
- దేశవ్యాప్తంగా ‘డిక్కీ’ని విస్తరిస్తాం