సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 08:30:45

రేపటి నుంచి పౌర విమానయాన అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సు

రేపటి నుంచి పౌర విమానయాన అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సు

హైదరాబాద్ : పౌర విమానయాన అంతర్జాతీయ ప్రదర్శన నగరంలో రేపటి నుంచి ప్రారంభం కానుంది. ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, పౌర విమానయానం - కేంద్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’సంయుక్త ఆధ్వర్యంలో “వింగ్స్‌ ఇండియా - 2020”అనే అంతర్జాతీయ పౌర విమానయాన ప్రదర్శన, సదస్సులను ఈనెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌ నగరంలోని బేగంపేట ఎయిర్‌పోర్టులో నిర్వహిస్తోంది. ఈనెల 12న బీ2బీ / బీ2జీ సమావేశాలు, ప్రదర్శన, ఎయిరోబాటిక్స్‌ / ఎయిర్‌ షోలను నిర్వహిస్తున్నారు. 13న ‘ఫ్లయింగ్‌ ఫర్‌ ఆల్‌' పేరిట ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌, భారత ప్రభుత్వం మోకా సంయుక్త కార్యదర్శి ఉషా పధీ, సివిల్‌ ఏవియేషన్‌ కమిటీ, ఫిక్కీ చైర్మన్‌, ఎండీ ఎయిర్‌ బస్‌ ఇండియా ఆనంద్‌ స్టాన్లీ, మోకా కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా, ఇంకా ఇందుకు ప్రత్యేక అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం - ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావులు పాల్గొంటున్నారు. ఈనెల 14న ప్రపంచాన్ని మమేకం చేస్తూ, మంత్రివర్గ ప్లీనరీకి, ఇతర ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూర్తి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈనెల 15వ తేదీన విమానయాన ప్రదర్శన, ఎయిరోబాటిక్స్‌ / ఎయిర్‌ షో జరుగనుంది. 


logo