గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 07:27:19

మున్సిపాలిటీల్లో ఆస్తి‌పన్నుపై వడ్డీ 90% తగ్గింపు

మున్సిపాలిటీల్లో ఆస్తి‌పన్నుపై వడ్డీ 90% తగ్గింపు

హైద‌రా‌బాద్: రాష్ట్ర‌వ్యా‌ప్తంగా అన్ని మున్సి‌పా‌లి‌టీ‌ల‌లోని ఆస్తి‌పన్ను బకా‌యి‌దా‌రు‌లకు పుర‌పా‌ల‌క‌శాఖ శుభ‌వార్త అందించింది. ఒకే‌సారి మొత్తం బకాయి చెల్లిస్తే, దానిపై వడ్డీ చెల్లిం‌పు‌లలో 90 శాతం తగ్గిం‌చ‌ను‌న్నట్టు ప్రక‌టిం‌చింది. ఆగస్టు 1 నుంచి సెప్టెం‌బర్‌ 15వ తేదీ వరకు ఈ ఆఫర్‌ అందు‌బా‌టులో ఉంటుం‌దని ఉత్త‌ర్వుల్లో పేర్కొ‌న్నది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించింది. 

ఒక్క జీహె‌చ్‌‌ఎంసీ పరి‌ధి‌లోనే ఆస్తిపన్ను బకాయిలు అసలు రూ.1,477.86 కోట్లు, వడ్డీ రూ.1,017.76 కోట్లు రావాల్సి ఉన్నది. ఈ మేరకు వారికి అధి‌కా‌రులు నోటీ‌సులు జారీ‌చే‌శారు. కొంత తగ్గిస్తే బకా‌యిలు చెల్లి‌స్తా‌మని పలు‌వురు ప్రభు‌త్వా‌నికి నివే‌దిం‌చారు. ఈ మేరకు ప్రభుత్వం వడ్డీ 90 శాతం తగ్గింపు ప్రక‌టిం‌చింది. తద్వారా ఒక్క జీహె‌చ్‌‌ఎం‌సీ‌లోనే దాదాపు రూ.900 కోట్ల మేర ప్రయో‌జనం కలు‌గ‌నుంది. 


logo