బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 13:58:00

అంతరపంటగా గంజాయి సాగు .. ధ్వంసం చేసిన పోలీసులు

అంతరపంటగా గంజాయి సాగు .. ధ్వంసం  చేసిన పోలీసులు

సంగారెడ్డి : అంతరపంటగా నిషేధిత గంజాయి మొక్కలను సాగు చేస్తుండటంతో పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లాలోని జహీరాబాద్ మండలంలోని  హుగెల్లి గ్రామ శివారులో ఇద్దరు రైతులు అక్రమంగా అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో.. దాడులు చేసి ధ్వంసం చేశామని జహీరాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా 300 మొక్కలు పెంచినట్లు ఆయన తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు రైతులు పరారీలో ఉన్నారన్నారు. ఎవరైనా గంజాయిని సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


logo