శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 01:06:40

ఆఖరి పరీక్షకు వెళ్తూ..

ఆఖరి పరీక్షకు వెళ్తూ..

  • రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం

కామేపల్లి: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చివరి పరీక్షకు వెళ్తూ ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి  చెందా డు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం రాయిగూడెం స్టేజీ సమీపంలో మంగళవారం చోటుచేసుకున్నది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన మామిడి వివేక్‌(17), గార్ల మండలం రాంపురానికి చెందిన వడ్లమూడి లెనిన్‌కుమార్‌ కలిసి బైక్‌పై పరీక్ష రాసేందుకు ఖమ్మం బయలుదేరారు. మార్గమధ్యంలో రాయిగూడెం స్టేజీ సమీపంలోని మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో వివేక్‌ మరణించాడు. 


logo