బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 10:07:38

ఇంటర్‌ పరీక్షకు వెళ్తుండగా విద్యార్థి మృతి

ఇంటర్‌ పరీక్షకు వెళ్తుండగా విద్యార్థి మృతి

ఖమ్మం : కారేపల్లి మండలం పొన్నెకల్‌ వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. ఇంటర్‌ పరీక్ష రాసేందుకు ఇద్దరు విద్యార్థులు కలిసి బైక్‌పై వెళ్తున్నారు. వేగంగా వెళ్తుండడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని డోర్నకల్‌కు చెందిన వివేక్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఇంటర్‌ మొదటి సంవత్సరం చివరి పరీక్ష. ఈ ఒక్క రోజు అయితే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగుస్తాయి.


logo