శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:04:59

నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌ ఫలితాలు

నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.50 లక్షలమంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ప్రక్రియకు బోర్డు దరఖాస్తులు చేసుకోవడానికి రెండు వారాల వరకు గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై 11 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించే అవకాశం ఉన్నది.

నమస్తే తెలంగాణ వెబ్‌సైట్ www.ntnews.com లో ఇంటర్‌ ఫలితాలు చూసుకోవచ్చు


logo