బుధవారం 27 మే 2020
Telangana - May 13, 2020 , 21:04:14

జూన్‌ ౩న ఇంటర్‌ జాగ్రఫీ-2 పరీక్ష

జూన్‌ ౩న ఇంటర్‌ జాగ్రఫీ-2 పరీక్ష

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను పూర్తిచేసేందుకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు సిద్ధమైంది. లాక్‌డౌన్‌ అమ్లలోకి రావడంతో మార్చి 23 న జరుగాల్సిన ఇంటర్‌ జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పరీక్షలు వచ్చే నెల మూడో తేదీన జరుగుతాయని ఇంటర్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పాత హాల్‌టికెట్ల నంబర్లతో గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు.


logo