మంగళవారం 26 మే 2020
Telangana - May 14, 2020 , 01:29:56

వాయిదాపడ్డ ఇంటర్‌ పరీక్ష జూన్‌ 3న

వాయిదాపడ్డ ఇంటర్‌ పరీక్ష జూన్‌ 3న

  • భూగోళశాస్త్రం, మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 పరీక్ష
  • పాత హాల్‌టికెట్లతోనే  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఇంటర్‌ సెకండియర్‌ భూగోళశాస్త్రం, మో డ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2ను పరీక్షను జూన్‌ మూడున నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. గతంలో జారీచేసిన హాల్‌టికెట్లతోనే పరీక్షకు హాజరుకావాలని సూచించారు.  మరోవైపు  ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ రెండోరోజు బుధవారం కొనసాగింది. 9,202 మంది ఎగ్జామినర్లు హాజరయ్యారు.


logo