గురువారం 04 జూన్ 2020
Telangana - May 12, 2020 , 10:24:55

ప్రారంభమైన ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌

ప్రారంభమైన ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. నగరంలోని గన్‌ఫౌండ్రీ మహబూబియా కాలేజీలో ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ను అధికారులు ప్రారంభించారు. కరోనా కారణంగా ఈసారి 33 కేంద్రాల్లో జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు.  గతంలో 12 కేంద్రాల్లో మాత్రమే పేపర్లను దిద్దేవారు. ముందుగా సెకండియర్‌ జవాబు పత్రాలను వాల్యుయేషన్‌ చేస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత ఫస్టియర్‌ పేపర్లను మూల్యాకనం చేయనున్నారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ విధుల్లో 15 వేల అధ్యాపకులు పాల్గొంటున్నారు. ఈ ఏడాది 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. మొత్తం 55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. 

మూల్యాంకన కేంద్రాల్లో అధికారులు కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒక్కో ఉద్యోగికి మూడు మాస్కులు, శానిటైజర్లు, పోలీసు పాసులను ప్రభుత్వం అందించింది. అదేవిధంగా వాల్యుయేషన్‌లో పాల్గొంటున్న సిబ్బందికి రవాణా, వసతి సదుపాయాలను కల్పించింది. జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.


logo