మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 10:44:20

రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ.. ఇంతలోనే హఠాన్మరణం

రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ.. ఇంతలోనే హఠాన్మరణం

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నోడల్ అధికారి జహీర్ అహ్మద్ మంగళవారం కన్నుమూశారు. వేపలగొడ్డలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఈ నెల 31న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన మరణం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తన ఉద్యోగ జీవితంలో ఎంతో మంది విద్యార్థులను ప్రతిభా వంతులుగా తీర్చిదిద్దారన్నారు. అంకితభావం కలిగిన ఓ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జహీర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ఆయన మృతి పలువురు ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.


logo