బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 17:35:02

రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

రాష్ట్రంలో  ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్చి 2020 ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యా్ర్థులందరినీ పాస్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇపుడు పాసైన వారందరినీ కంపార్ట్ మెంట్లలో పాసైనట్టుగా గుర్తించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించనుంది. ఈ మేరకు విద్యార్థులకు జులై 31 తర్వాత సంబంధిత కళాశాలల్లో మార్కుల మెమోలు జారీచేస్తారని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo