శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Aug 08, 2020 , 01:45:39

అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత మార్కెట్లు

అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత మార్కెట్లు

  • సీఎం కేసీఆర్‌ కసరత్తు
  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి రూరల్‌: రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలతో సమీకృత మార్కెట్‌ నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. త్వరలోనే అన్ని హంగులతో మార్కెట్‌ నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేయనున్న ఆధునిక సమీకృత మార్కెట్‌ స్థలాన్ని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాతో కలిసి మంత్రి పరిశీలించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తన చేయి బెనకడంతో కార్యక్రమానికి పట్టి వేసుకుని వచ్చారు.