బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 12:57:32

సమీకృత మార్కెట్‌తో సమస్యలు దూరం: మంత్రి అల్లోల

సమీకృత మార్కెట్‌తో సమస్యలు దూరం: మంత్రి అల్లోల

నిర్మల్: జిల్లా కేంద్రంలో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌తో కూరగాయల వ్యాపారులకు సమస్యలు తీరనున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్‌ను మంత్రి పరిశీలించారు. కూరగాయల వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హోల్ సెల్ వ్యాపారులకు పట్టణంలో అనువైన ప్రదేశం కేటాయిస్తామని చెప్పారు. నిర్మల్ పట్టణంలోని బైల్ బజార్, న్యూ బస్‌స్టాండ్ వద్ద, ఈదిగం వద్ద చిన్న తరహా కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో రైతులకు దూరాభారం తగ్గుతుందన్నారు. నిర్మల్ బస్ స్టాండ్ సమీపంలో గజ్వేల్, సిద్దేపేట తరహా సమీకృత మార్కెట్‌ను నిర్మిస్తామని చెప్పారు. 


logo