శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 19:30:00

అందరికి అందుబాటులో సమీకృత మార్కెట్‌

అందరికి అందుబాటులో సమీకృత మార్కెట్‌

ఖమ్మం : ప్రజలకు శుద్ధమైన ఆహార పదార్థాలను అందించడంతో పాటు రైతుల ఉత్పత్తులకు నాణ్యమైన ధర లభింపచేసేందుకే సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్‌లను అందుబాటులోకి తెస్తున్నామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌లో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన ఆధునిక సమీకృత మార్కెట్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మార్కెట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్లతో పాటు ఖమ్మంలో ఆధునిక సమీకృత మార్కెట్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. భవిష్యత్‌లో మరింత ఆకర్షనీయంగా పరిశుభ్రంగా నిర్వహించుకునేలా మార్కెటింగ్‌ అధికారులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణలోని అతికొద్ది మార్కెట్‌లలో ఖమ్మం నగర సమీకృత మార్కెట్‌ ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.

ఖమ్మం నగరాన్ని రోజు రోజుకూ మరింత హంగులతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ప్రపంచ పసుపు ఉత్పత్తిలో ఆ జిల్లాదే 8 శాతం

భయపడొద్దు..బాగవుతుంది 

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
logo