గురువారం 21 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 19:29:44

టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్ సమగ్రాభివృద్ధి : వినోద్‌కుమార్‌

టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్ సమగ్రాభివృద్ధి : వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో వారు మాట్లాడారు. నగరంలో వరద సమస్యను రూపుమాపేందుకు ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను తూ.చా. తప్పక అమలు చేస్తామని పేర్కొన్నారు. నగరంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు కేశవపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకు మరింత కృషి చేస్తామన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు జీహెచ్‌ఎంసీ పరిధిలో లేని విషయాలను మ్యానిఫెస్టోలో ప్రస్తావించాయని గుర్తించారు. ఇవి స్థానిక సంస్థలన్న విషయం కూడా రెండు జాతీయ పార్టీలకు తెలియకపోవడం బాధకరమన్నారు. బీజేపీ, ఎంఐఎం నాయకులు ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా మాట్లాడటం సరికాదన్నారు. మామూలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రులు ఎన్నికల సమయంలో విమర్శించడం దేని కోసమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నగర అభివృద్ధిపై విజన్‌తో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని, టీఆర్ఎస్‌ను ప్రజలు ఆశీర్వదించాలి కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo