బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 09:27:49

మార్కెట్‌కు తెచ్చే ఉత్పత్తులకు బీమా: మంత్రి నిరంజన్‌ రెడ్డి

మార్కెట్‌కు తెచ్చే ఉత్పత్తులకు బీమా: మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌: మార్కెట్‌కు తెచ్చే ఉత్పత్తులకు బీమా కిల్పిస్తునామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రకటించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని ఆయన హామీ ఇచ్చారు. ఈదురు గాలులతో కొహెడ పండ్ల మార్కెట్‌ నేలమట్టమయ్యింది. ఈ దుర్ఘటనలో 30 మందికి గాయాలయ్యాయని, చికిత్స అనంతరం 12 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మరో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని కామినేని హాస్పిటల్‌కు తరలించామని వెల్లడించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గడ్డిఅన్నారం పండ్ల  మార్కెట్‌ను నగర శివారులోని కొహెడకు తలించారు. అయితే సోమవారం ఒక్కసారిగా వచ్చిన గాలివానతో రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి.


logo