శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 02:40:39

రియల్టీకి ఊతమిస్తాం: ఎస్బీఐ

రియల్టీకి ఊతమిస్తాం: ఎస్బీఐ

హైదరాబాద్‌: కరోనాతో స్తంభించిన మార్కెట్‌ను ప్రోత్సాహకాలతో బ్యాంకింగ్‌ పరిశ్రమ పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నదని ఎస్బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓపీ మిశ్రా అన్నారు. శనివారం ఇక్కడ క్రెడాయ్‌ హైదరాబాద్‌తో ఆయన సమావేశమయ్యారు. బ్యాంక్‌, రియల్టర్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ఈ సందర్భంగా దృష్టి పెట్టారు. గృహ రుణాల మంజూరు, ప్రాజెక్టులతో టై-అప్‌, కొత్త ప్రాజెక్టులకు నిధులు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు పీ రామకృష్ణారావు ప్రధాన కార్యదర్శి వీ రాజశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.