గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 18, 2021 , 01:23:13

పాఠాలుగా స్ఫూర్తిగాథలు

పాఠాలుగా స్ఫూర్తిగాథలు

  • విద్యాశాఖకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సూచన 
  • సిరిసిల్ల రాజేశ్వరి విజయాన్ని మహారాష్ట్రలో పాఠ్యాంశంగా చేర్చడంపై సంతోషం

హైదరాబాద్‌, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ‘కాలివేళ్ల’కథననారి సిరిసిల్ల రాజేశ్వరి స్ఫూర్తిగాథను మహారాష్ట్ర విద్యాశాఖ పాఠ్యాంశంగా చేర్చడం గర్వంగా ఉన్నదని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ప్రత్యేక ప్రతిభావంతురాలు బూర రాజేశ్వరి.. సిరిసిల్ల రాజేశ్వరిగా సాహితీలోకానికి చిరపరచితురాలు. ఆమె విజయగాథను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చటం అమితానందంగా ఉన్నదని సంతోషం వ్యక్తంచేశారు. మహారాష్ట్ర యువత సిరిసిల్ల రాజేశ్వరి విజయగాథ నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి స్ఫూర్తిదాయక విజయగాథల్ని పాఠ్యాంశాలుగా చేర్చాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రారామచంద్రన్‌కు ట్విట్టర్‌లో సూచించారు. కాగా, చిన్నప్పటి నుంచి చేతులు పనిచేయకున్నా కాలివేళ్లతో రాస్తూ ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేసిన కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఆమె రాసిన 800 కవితలను ‘సిరిసిల్ల రాజేశ్వరి కవితలు’ పేరిట ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ముద్రించారు. 2015లో సుద్దాల హన్మంతు పురస్కారాన్ని సిరిసిల్ల రాజేశ్వరి పొందటం గమనార్హం.

VIDEOS

logo