ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 17:54:02

భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి జయశంకర్‌ సార్‌ : మంత్రి వేముల

భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి జయశంకర్‌ సార్‌ : మంత్రి వేముల

హైదరాబాద్‌ : తెలంగాణ భవిష్యత్‌ తరాలకు ఆచార్య జయశంకర్‌ సార్‌ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రోడ్డు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌సార్‌ వర్ధంతి సందర్భంగా సార్‌ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా యావజ్జీవితం తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన మహోన్నతుడు జయశంకర్‌ సార్‌ అని కొనియాడారు.  ఆయన కలలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. బీడు భూములు సస్యశ్యామలమైతేనే తెలంగాణ రైతుల గోస తొలగుతుందన్న జయశంకర్‌ సార్‌ మాటలే స్ఫూర్తిగా రైతుల కళ్లలో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపుతున్నారన్నారు. 


logo