శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 16:39:00

చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధితో సికింద్రాబాద్ పై తగ్గనున్న భారం

చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధితో సికింద్రాబాద్ పై తగ్గనున్న భారం

హైద‌రాబాద్‌ :  చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌కు అనుసంధానం చేస్తూ అభివృద్ది చేస్తున్న రోడ్ల‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఫిర్జాదిగూడ మేయ‌ర్ జ‌క్కా వెంక‌ట్‌రెడ్డి, బోడుప్ప‌ల్ మేయ‌ర్ సామ‌ల బుచ్చిరెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ ను జంక్ష‌న్‌గా అభివృద్ది చేయ‌డంతో సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌పై ఒత్తిడి త‌గ్గుతుంద‌ని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్‌కు చేరుకునే మార్గాల‌ను విస్త‌రిస్తున్న‌ట్లు తెలిపారు. 

చెంగిచ‌ర్ల చౌర‌స్తా నుంచి రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి మీదుగా పెద్ద చర్లపల్లివ‌ర‌కు 100 అడుగుల వెడ‌ల్పుతో రోడ్డును విస్త‌రిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. అలాగే ఐవోసీ పెట్రోల్ బంక్ నుంచి భ‌ర‌త్‌న‌గ‌ర్ మీదుగా రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ చేస్తున్న‌ట్లు వివరించారు. వీటితో పాటు ఎన్‌.ఎఫ్‌.సి చౌర‌స్తా నుంచి చెంగిచ‌ర్ల చౌరస్తా మెయిన్‌రోడ్ దారిలో భార‌త్‌ గ్యాస్ కంపెనీ పక్క నుంచి ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ వ‌ర‌కు నూత‌నంగా 120 అడుగుల వెడ‌ల్పుతో రోడ్డు నిర్మించేందుకు ప్ర‌తిపాదిత భూముల‌ను ప‌రిశీలించారు. ఈ నూత‌న రోడ్డు నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూమిని సేక‌చేందుకు అట‌వీ, టి.ఎస్‌.ఐ.ఐ.టీ.సీ అధికారుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి ప్ర‌తిపాద‌న‌ల‌కు తుదిరూపు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. 


   


logo