శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 19, 2020 , 18:43:50

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.  హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతించడంతో  57 రోజుల తర్వాత బస్సులు  నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌- హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రయాణించారు. బస్సులో భౌతిక దూరం, శానిటైజర్ల ఏర్పాట్లను   అడిగి తెలుసుకున్నారు.  సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు.  ప్రయాణికులు ఆర్టీసీ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. అంతకుముందు మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ను మంత్రి తనిఖీ చేశారు. 


logo