బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:48:44

దళిత, గిరిజన హక్కులకు భరోసా

దళిత, గిరిజన హక్కులకు భరోసా

ఫిర్యాదులపై కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల విచారణ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని దళిత, గిరిజన హక్కుల పరిరక్షణపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ భరోసా ఇస్తున్నదని ఆ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పలువురు బాధితుల ఫిర్యాదుపై సోమవారం చైర్మన్‌ ఎర్రోళ్ల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. వనపర్తి జిల్లా చింతకుంటకు చెందిన విష్ణు తన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని చేసిన ఫిర్యాదుపై విచారించిన కమిషన్‌.. బాధితుడికి న్యాయం చేయాలని సూచించింది. తనపై నేర అభియోగాన్ని కోర్టు కొట్టేసినా ఉద్యోగం ఇవ్వడం లేదని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన రాజు ఫిర్యాదుచేశారు. ఓయూ రిజిస్ట్రార్‌, ఇతర అధికారులతో విచారణ జరిపి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది.