ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:34

సుస్థిరాభివృద్ధి దిశగా వినూత్న పథకాలు

సుస్థిరాభివృద్ధి దిశగా వినూత్న పథకాలు

  • నీతిఆయోగ్‌ ప్రధాన సలహాదారు డాక్టర్‌ జైన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా భారత ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను రూపొందించిందని నీతిఆయోగ్‌ ప్రధాన సలహాదారు డాక్టర్‌ ఏకే జైన్‌ చెప్పారు. గురువారం ఎంసీహెచ్చార్డీ, ఆర్‌బీవీఆర్‌ఆర్‌ మహిళా కళాశాల సంయుక్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో డాక్టర్‌ జైన్‌ కీలక ఉపన్యాసం చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే క్రమంలో ప్రభుత్వంతోపాటు కార్పొరేట్‌ రంగం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, స్వయం సహాయ సంఘాలతోపాటు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. సమాజ శ్రేయస్సుకు తోడ్పడేవిధంగా విద్యార్థుల ఆలోచనా పరిధిని పెంచేలా విద్యాసంస్థలు విధానాన్ని రూపొందించి అమలుపరచాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య వీవెంకటరమణ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎంసీహెచ్చార్డీ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంసీహెచ్చార్డీ సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధన విభాగం సంచాలకుడు దివ్యసర్మార్‌, ప్రొఫెసర్‌ ముత్యంరెడ్డి, ఆర్‌బీవీఆర్‌ఆర్‌ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆచ్యుతదేవి, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ విజయ, విద్యావేత్తలు పాల్గొన్నారు. logo