శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:16

కొవిడ్‌ రోగుల్ని పట్టేస్తా!

కొవిడ్‌ రోగుల్ని పట్టేస్తా!

  • మాస్క్‌, హ్యాండ్‌ శానిటైజర్‌ ఇతర ఫీచర్లతో థర్మల్‌ కియోస్క్‌
  • కొవిడ్‌ స్క్రీనింగ్‌ యంత్రాన్ని తయారుచేసిన కరీంనగర్‌ కుర్రాడు

కొత్తపల్లి: ఇంటి నుంచి కాలు బయటపెడితే ముఖానికి మాస్క్‌, జేబులో హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాల్సిందే. ప్రతి దుకాణం, కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ శానిటైజర్‌ పట్టుకొని స్ప్రే చేస్తున్నారు. డిజిటల్‌ థర్మామీటర్‌ పట్టుకొని ఉష్ణోగ్రతను చెక్‌ చేస్తున్నారు. ఆ ఇబ్బందుల్లేకుండా అన్ని పనులనుచేసే ‘పీఎక్స్‌-99 కొవిడ్‌-19 కియోస్క్‌' ను కరీంనగర్‌కు చెందిన సుశాంత్‌రెడ్డి తయారుచేశాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను కలిగిన ఈ కియోస్క్‌కు పదడుగుల దూరంలో నిల్చోగానే మాస్కు పెట్టుకున్నామా? లేదా? అని పసిగడుతుంది. చేతులను ముందుకు చాపితే శానిటైజర్‌ను స్ప్రే చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులను, గుండె కొట్టుకునే వేగం, ఊపిరితిత్తుల పనితీరును గుర్తిస్తుంది. గంటకు 500 మందిని దీనిద్వారా పరిశీలించవచ్చు. దీని పనితీరును కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కే శశాంక, మేయర్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌లకు ఇటీవల సుశాంత్‌రెడ్డి వివరించారు. 


logo