బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 12:39:41

డ్రైవర్ల నిర్లక్ష్యంతో బలవుతున్న అమాయకులు: మంత్రి జగదీష్‌ రెడ్డి

డ్రైవర్ల నిర్లక్ష్యంతో బలవుతున్న అమాయకులు: మంత్రి జగదీష్‌ రెడ్డి

నల్లగొండ: అంగడిపేట రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించినప్పటికీ.. డ్రైవర్ల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇతరుల పొరపాటుతో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో కలిసి దేవరకొండ ప్రభుత్వ దవాఖానలోని మార్చురీలో మృతదేహాలను పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారికి తగిన సాయం అందిస్తామని చెప్పారు. 


కాగా, గురువారం సాయంత్రం నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అంగడిపేట స్టేజీ వద్ద హైదరాబాద్‌-సాగర్‌ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కంటైనర్‌ ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలకు దేవరకొండలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. హాస్పిటల్‌ ప్రాంగణం బంధువుల రోదనలతో మిన్నంటింది.  

VIDEOS

logo