గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 13:39:58

బసంత్ నగర్ లో విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రారంభమైన సర్వే

బసంత్ నగర్ లో విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రారంభమైన సర్వే

పెద్దపల్లి : జిల్లాలోని పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన విమానాశ్రయ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వ ఏవియేషన్ అధికారుల ఆదేశాల మేరకు నాసిక్ కు చెందిన సర్వే బృందం బుధవారం సందర్శించింది. బసంత్ నగర్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలను శాటిలైట్ ద్వారా పరిశీలించారు.

15 రోజుల పాటు ఈ ప్రాంతంలో చుట్టూ 20 కిలోమీటర్ల దూరంలో భౌగోళిక స్థితిగతులను సేకరిస్తామని ఏవియేషన్ సంస్థ సర్వే బృందం సభ్యులు తెలిపారు. బృందం సభ్యులు ఈ ప్రాంతంలో సర్వే చేయడంతో విమానాశ్రయం ఏర్పాటుకు మరింత మార్గం సుగమం అయినట్లేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.


logo