బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 00:53:35

పెద్దమ్మతల్లికి ఐటీ బోనం!

పెద్దమ్మతల్లికి ఐటీ బోనం!

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని పెద్దమ్మ తల్లికి తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) సోమవారం చీర సారె పెట్టి బోనం సమర్పించింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆరుగురు గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు అమ్మవారికి మొక్కు చెల్లించారు. కొవిడ్‌ మహమ్మారి తగ్గాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు టీటా గ్లోబల్‌ అధ్యక్షుడు సందీప్‌కుమార్‌ మక్తాల తెలిపారు.

- హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ


logo