ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 10:08:05

శ్రీశైలం ప్రాజెక్టుకు 37,936 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

శ్రీశైలం ప్రాజెక్టుకు 37,936 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

శ్రీశైలం : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు కృష్ణా నదికి వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత 865.10 అడుగుల మేర నీరుంది. పూర్తి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, 122.7178 టీఎంసీల నిల్వ ఉంది.  ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 37,936 క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 40,259 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎడమ గట్టులో జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది. అలాగే నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. జలాశయానికి ఇన్‌ఫ్లో 40,259 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ ఫ్లో 6,816గా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 562.1 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రాజెక్టు పూరిస్థాయి నీటిమట్టం 313.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 237.3 టీఎంసీలు నిల్వ ఉంది. కాగా, అలాగే ప్రియదర్శిని జూరాల జలాశయానికి 48వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. జలాయశం నీటి మట్టం 1,042 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.929 టీఎంసీలు నీరు ఉండగా, పూర్తి స్థాయి నీటి నిల్వ 9.567 టీఎంసీలు. జలాశయం నుంచి దిగువకు 37,936 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo