మంగళవారం 07 జూలై 2020
Telangana - May 26, 2020 , 15:23:13

డ్రైనేజీలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం

డ్రైనేజీలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం

హైదరాబాద్‌ : ఆ శిశువును ఏ తల్లిదండ్రులు కన్నారో.. కానీ కనికరం లేకుండా చంపేశారు. నవమాసాలు మోసిన తర్వాత పేగును తెంచుకు పుట్టిన ఆ శిశువు తల్లి లాలనకు దూరమైంది. అమ్మ పాలు తాగాల్సిన ఆ బిడ్డ.. మురికి నీళ్లు తాగి ప్రాణాలు విడిచింది. డ్రైనేజీలోనే సజీవ సమాధి అయింది ఆ నవజాత శిశువు. ఈ హృదయ విదారక ఘటన నగరం నడిబొడ్డున చోటు చేసుకుంది. 

సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజారులో మంగళవారం ఉదయం డ్రైనేజీ లీక్‌ అవుతోంది. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వచ్చారు. డ్రైనేజీని శుభ్రం చేస్తుండగా.. అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం మురికి నీళ్లపై తేలియాడుతూ కనిపించింది. తక్షణమే పోలీసులకు వారు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న గోపాలపురం పోలీసులు.. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ డ్రైనేజీకి లింకు ఉన్న నివాసాలను పోలీసులు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. శిశువు మృతదేహం ఎక్కడ్నుంచి వచ్చి ఉంటుంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo