ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 06:43:24

30 రోజుల్లో ఇంటర్‌ ఫలితాలు

30 రోజుల్లో ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్ : ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ బుధవారం ప్రారంభమైంది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు జిల్లా ఇంటర్‌ విద్యాధికారులకు (డీఐఈవో) వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో స్పాట్‌ వాల్యుయేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 కేంద్రాలు ఉండగా, వాటిని 33 కేంద్రాలకు పెంచారు. 30 రోజు ల్లో సెకండియర్‌ ఫలితాలు విడుదల చేయడానికి దాదాపు 15 వేల మంది ఎగ్జామినర్లను నియమించబోతున్నారు. ఆ తర్వాత ఫస్టియర్‌ ఫలితాలు విడుదలచేయడానికి ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది.

స్పాట్‌ కేంద్రాల్లో ఎగ్జామినర్లు నిర్ణీత దూరం పాటించేలా గురువారం నుంచి ముమ్మర చర్యలు తీసుకోబోతున్నారు. మాస్కు లు శానిటైజర్‌ సిద్ధంచేశారు. ఎగ్జామినర్లు స్పాట్‌ కేంద్రాలకు చేరుకోవడానికి పాస్‌లు జారీచేస్తున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో 9.50 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జూనియర్‌ కాలేజీల నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం, సిలబస్‌, పరీక్షల నిర్వహణ, ఫలితాలు విడుదలపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ఏర్పడిన కమిటీ.. తన నివేదికను త్వరలోనే క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి అందజేయనున్నది.


logo