గురువారం 04 జూన్ 2020
Telangana - May 18, 2020 , 22:47:17

పరిశ్రమలు నిబంధనలు పాటించాలి

పరిశ్రమలు నిబంధనలు పాటించాలి

సంగారెడ్డి : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పరిశ్రమలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ఇచ్చిన అవకాశాన్ని కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్షించారు. కోవిడ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై దిశానిర్ధేశం చేశారు. పరిశ్రమలు నిర్వహణ కోసం ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నదని, ఇంకా అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారు. 

పరిశ్రమల్లో కార్మికుల భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని, ఎప్పటికప్పుడు శానిటైజర్‌ వాడాలని సూచించారు. ఇటీవల వైజాగ్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో ఇక్కడి పరిశ్రమల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. కార్మికులను తరలించే పరిశ్రమల బస్సులో కూడా ఎవరికి వారు నిబంధనలు పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహించే పరిశ్రమల యాజమన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి వేళలో విషవాయువులు వదిలే పరిశ్రమలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. గ్యాస్‌, బాయిలర్‌ వదిలే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాజమాన్యాలకు ఎలాంటి సపోర్ట్‌ కావాలన్నా, సమస్యలున్నా 08455-272525కు ఫోన్‌ చేయాలన్నారు. అంతకు ముందు మంత్రి కళాకారులక నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.logo