మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 18:58:30

వేగంగా కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించిన ఇండస్‌ టవర్స్‌

వేగంగా కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించిన ఇండస్‌ టవర్స్‌

హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సెలఫోన్ టవర్లు కూలిపోయాయి. వాటిని త్వరిత గతిన రిపేర్ చేసి కేవలం కొన్ని గంటల్లోనే కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించింది ఇండస్‌ టవర్స్‌. వరదల కారణంగా హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌ , నల్గొండ జిల్లాలలో భారీ  అక్టోబర్‌ 13,14 తేదీలలో నెట్‌వర్క్‌ టవర్లకు ఆటంకం కలిగింది. దీంతో ఇండస్‌ టవర్స్‌కు చెందిన140 మంది క్షేత్రస్ధాయి సిబ్బంది 850 టవర్లను యుద్దప్రాతిపదికన  పునరుద్ధరించారు. ఇండస్‌ టవర్‌ క్షేత్రస్ధాయి సిబ్బందితో పాటు ఇంజినీర్లు , సాంకేతిక నిపుణుల బృందం చేసిన కృషి కనెక్టివిటీని పునరుద్ధరించారు.

ఈ తరహా ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ఎదురయ్యే అసాధారణ సవాళ్లను సైతం ధీటుగా ఎదుర్కొవడంతో పాటుగా, రోడ్ల మీద నీరు నిల్వ ఉండటం కారణంగా ప్రయాణాలపై నిషేదం ఉన్నప్పటికీ , రవాణాపరంగా అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఇండస్‌ టవర్స్‌కు చెందిన 140 మంది క్షేత్రస్ధాయి సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేయడంతో పాటుగా ఈ వర్షాల వల్ల ప్రభావితమైన 850 సైట్లను 48 గంటల లోపుగా పునరుద్ధరించారు.

మిగిలిన 2350 టవర్లు పనిచేస్తుండటంతో పాటు ప్రభావితమైన 850సైట్లను యుద్ధ ప్రాతిపదికన సందర్శించి వాటిని పునరుద్ధరించారు. అందువల్ల అధికార యంత్రాంగం, ప్రజలు, వ్యాపార సంస్ధలు త్వరగా స్పందించడంతో పాటుగా వర్షం  వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు సహాయమందించడం సాధ్యమైంది.‘‘ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత కీలకమైనది.ఈ పరిస్థితులలో మొబైల్‌ టవర్లు దోహద పడతాయి. ఇండస్‌ టవర్స్‌ కఠినమైన పరిస్థితులలో సైతం నెట్‌వర్క్‌ కనెక్షన్స్‌ను అందించగలిగాము" అని  ఇండస్‌ టవర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అండ్‌ తెలంగాణా సీసీఈఓ సుబ్బు అయ్యర్ అన్నారు. (ఇది చదవండి : రోజులో ఎన్నిసార్లు పళ్లు తోముకోవాలి..)

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.